Botcha Satyanarayana✓

@BotchaBSN

MLC, Opposition Leader, Andhra Pradesh Legislative Council. #YSRCP #BotchaSatyanarayana

  • Vizianagaram, India
  • Joined
39 Following65.4K Followers1.6K Posts
  1. Botcha Satyanarayana✓@BotchaBSN
    నవంబర్ 5న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గరివిడి మండలం కోడూరు గ్రామంలో యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు, జడ్పీటీసీ అభ్యర్థిని శ్రీమతి బొత్స పూజిత గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. గ్రామ ప్రజలు, మహిళలు, యువత, కార్యకర్తలు పూలు, హారతులు, డప్పుల నడుమ చూపించిన ఆత్మీయ స్వాగతం ఎంతో ఆనందాన్నిచ్చింది. మా కుటుంబంపై మీరు చూపిస్తున్న అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కోడూరు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేశాను. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడాను. ఈ ఎన్నికల్లో గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థిని శ్రీమతి బొత్స పూజిత గారిని, కోడూరు ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి గేదెల అన్నాలు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. #BotchaSatyanarayana #BotchaSandeep #BotchaPoojitha #YSRCP #Cheepurupalli #Garividi #LocalBodyElections #TeamBotcha
    Download
    0192423.1K
  2. Botcha Satyanarayana✓@BotchaBSN
    ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి! అర్నబ్ తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ముఖ్యంగా తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనలను తప్పక పాటించాలి.అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాల కింద ఎవరూ ఉండకండి. కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, తాగునీరు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోండి. #CycloneArnab #CoastalSafety #CycloneSafety #BotchaSatyanarayana #YSRCP #TeamBotcha
    Download
    112113974
  3. Botcha Satyanarayana✓@BotchaBSN
    విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తినిచ్చింది. పైడితల్లి అమ్మవారి జాతర మన ప్రాంతానికి గర్వకారణం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం మన సంస్కృతి, వారసత్వం, భక్తి విశ్వాసాలకు ప్రతిబింబంగా నిలుస్తోంది. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక వాతావరణం, సంప్రదాయ వేడుకలతో విజయనగరం పండుగ శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #vizianagaram #pydithalliammavarifestival #pydimamba #AndhraPradesh
    Download
    1161711.8K
  4. Botcha Satyanarayana✓@BotchaBSN
    శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మరియు సిరిమానోత్సవ శుభాకాంక్షలు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి మన పైడితల్లి అమ్మవారు. ఆ తల్లి చల్లని దీవెనలతో ప్రజలందరి జీవితాల్లో ఆనందం, సంపద వెల్లివిరియాలని మనసారా వేడుకుంటున్నాను. #SriPaiditalliAmmavaru #Sirimanotsavam #Uttarandhra #BotchaSatyanarayana #YSRCP #TeamBotcha
    Download
    1122132.1K
  5. Botcha Satyanarayana✓@BotchaBSN
    Botcha Satyanarayana
    RT @DrBotchaAnusha: చీపురుపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీ బెల్లాన వంశీ గారు విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించాను. ఈ కార్యక్రమంలో యువ నాయకులు శ్రీ బొత్స సందీప్ గారితో కలిసి పాల్గొన్నాను.
    010136
  6. Botcha Satyanarayana✓@BotchaBSN
    Botcha Satyanarayana
    RT @DrBotchaAnusha: మాజీ జడ్పీటీసీ శ్రీ కోరాడ వెంకటరావు గారి నివాసంలో ఆనందపురం మండలం ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చాను. #BotchaAnusha #Anandapuram #YSRCP #TeamBotcha
    04069
  7. Botcha Satyanarayana✓@BotchaBSN
    నా సోదరుని కుమారుడు, యువ నాయకుడు శ్రీ బొత్స చైతన్య గారు పూసపాటిరేగ మండలం ZPTC అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, ప్రజలతో ఆయనకున్న అనుబంధం పూసపాటిరేగ మండల అభివృద్ధికి తోడ్పడతాయని విశ్వసిస్తున్నాను. పూసపాటిరేగ మండల ప్రజలు శ్రీ బొత్స చైతన్య గారిని ఆదరించి, ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. #BotchaChaitanya #PusapatiregaZPTC #YSRCP #LocalBodyElections #TeamBotcha
    Download
    1463472.7K
  8. Botcha Satyanarayana✓@BotchaBSN
    నా సోదరి, ప్రజలకు సుపరిచితమైన నాయకురాలు శ్రీమతి సంగమురెడ్డి వెంకటలక్ష్మీ గారు గుర్ల మండలం ZPTC అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రజాసేవలో ఆమెకు ఉన్న అనుభవం, ప్రజల పట్ల ఆమెకున్న అంకితభావం గుర్ల మండల అభివృద్ధికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాను. గుర్ల మండల ప్రజలు నా సోదరి శ్రీమతి సంగమురెడ్డి వెంకటలక్ష్మీ గారిని ఆదరించి, ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. #SangamuLakshmi #GurlaZPTC #YSRCP #LocalBodyElections #TeamBotcha
    Download
    1242102.1K
  9. Botcha Satyanarayana✓@BotchaBSN
    ఉత్తరాంధ్రలో ప్రజాసేవకు అంకితమైన మా కుటుంబం నుంచి నా కోడలు శ్రీమతి బొత్స పూజిత గారు గరివిడి మండలం ZPTC అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం సంతోషంగా ఉంది. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో ఆమె అందించిన సేవలు అభినందనీయం. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, గరివిడి మండల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలనే ఆమె సంకల్పాన్ని స్వాగతిస్తున్నాను. పూజిత గారిని మీ ఇంటి బిడ్డగా ఆదరించి, ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నాను. #BotchaPoojitha #BotchaSandeep #GarividiZPTC #LocalBodyElections #YSRCP #TeamBotcha
    Download
    2644012.9K
  10. Botcha Satyanarayana✓@BotchaBSN
    గరివిడి మండలం ZPTC అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా కోడలు శ్రీమతి బొత్స పూజిత గారికి మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. మా కోడలు పూజిత గారు కూడా ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, గరివిడి మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నారు. ఆమెను మీ ఇంటి బిడ్డగా ఆదరించి, మీ నమ్మకాన్ని, ఆశీర్వాదాన్ని అందించండి. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే అవకాశం కల్పించండి. మీ అమూల్యమైన ఓటు, మీ ఆశీర్వాదమే ఆమెకు కొండంత బలం. #BotchaPoojitha #Botchasatyanarayana #GarividiZPTC #Localbodyelections #YSRCP #TeamBotcha
    Download
    1115097713.3K
  11. Botcha Satyanarayana✓@BotchaBSN
    గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలం బిళ్లలవలస గ్రామానికి చెందిన శ్రీ నెట్టి ముకుంద గారి కుటుంబ సభ్యులు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించాను. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీ బొద్దల చిన్నంనాయుడు గారు, శ్రీ సుంకరి సత్యనారాయణ గారు, శ్రీ పల్లి రఘు గారు, శ్రీ మహాంతి రమణ గారు, శ్రీ మూకల వెంకట చలం నాయుడు గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #YSRCP #YSJagan #LocalBodyElection #TeamBotcha
    Download
    081302K
  12. Botcha Satyanarayana✓@BotchaBSN
    చీపురుపల్లిలో గరివిడికి చెందిన సుమారు 300 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉంది. శ్రీ బొత్స సత్యనారాయణ గారి సమక్షంలో కొత్తగా చేరిన వారందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను. పార్టీ బలోపేతానికి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. #BotchaSatyanarayana #YSRCP #Cheepurupalli #Garividi #TeamBotcha
    Download
    0235539
  13. Botcha Satyanarayana✓@BotchaBSN
    పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు, 50 కుటుంబాల సభ్యులు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ బొత్స అనూష గారి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఐక్యతతో ముందుకు సాగుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ముఖర శ్రీను గారు, ముఖర గురునాయుడు గారు, సూరాల రమణ గారు, గాడు లక్ష్మణరావు గారు, సురల పైడన్న గారు, సుంకరి అచ్చన్న గారు, కనకల అప్పలనాయుడు గారు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పద్మనాభం మండల నాయకులు శ్రీ సుంకరి గిరిబాబు గారు, శ్రీ కంటుబోతు రాంబాబు గారితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #BotchaAnusha #YSRCP #Bheemili #YSJagan #LocalBodyElections #AndhraPradesh
    Download
    171602.1K
  14. Botcha Satyanarayana✓@BotchaBSN
    గుర్ల మండలం గరికవలస గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చాను. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించాను. నాయకులు, కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించాను. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, గుర్ల మండల నాయకులు, గరికవలస గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #BotchaSatyanarayana #YSJagan #Gurla #Garikavalasa #LocalBodyElections #YSRCP #AndhraPradesh
    Download
    0121411.3K
  15. Botcha Satyanarayana✓@BotchaBSN
    గరివిడి క్యాంపు కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, భీమిలి నియోజకవర్గ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష గారు, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారితో కలిసి గరివిడి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యాను. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులతో చర్చించాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించాను. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజలకు మరింత చేరువ కావాలని, గరివిడి పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులంతా సమిష్టిగా పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని స్పష్టం చేశాను. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వరరావు గారు, మాజీ జెడ్పీటీసీ శ్రీ వాకాడ శ్రీను గారు, గరివిడి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. #BotsaSatyanarayana #BotchaAnusha #BotchaSandeep #YSRCP #Garividi #LocalBodyElections
    Download
    0121491.7K
  16. Show more posts